ఎరవరిది కష్టం .. నీదా ?
కన్న తల్లికి దూరం అయ్యి .. పెద్ద అయ్యాక పెంచిన తల్లికి దూరం అయ్యి ..
ప్రేమించిన రాధని కోల్పోయి .. ధర్మానికి కట్టుబడి పాండవుల వైపు నిలబడి గాంధారి శాపనికి గురైన కృష్ణుడికంటే గొప్పదా నీ కష్టం ?
జీవితంలో కష్టాలు.. ఆనందాలు .. సరిసమానంగా ఉండాలి అని కోరుకోవటం సహజం.. కానీ.. వచ్చే కష్టాన్ని ఎదుర్కోలేనంత పిరికివాళ్ళము కాదు మనం..
ఒకసారి రాధ ఇలా అడిగింది కృష్ణుడిని " కృష్ణా.. నా స్థానం ఏంటి నీ జీవితం లో? " అని.. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు " రాధా !! నువ్వెప్పుడు నా ఆలోచనల్లో ఉంటావు.. నా మనసులో ఉంటావు.. నేను చేసే ప్రతి పనిలో ఉంటావు .. నీ స్థానం నా మనసు " అని .. అప్పుడు రాధ ఇలా అడిగింది "కృష్ణా !! మరి నేనెక్కడ లేను అని ".. కృష్ణుడు అప్పుడు ఇలా పలికాడు " నా తల రాతలో రాధ !!" అని ..
కృష్ణుడు అంతటి వాడికే కర్మ ఫలం అనుభవించక తప్పలేదు .. సాధారణ మనవులం .. మనం ఎంత ఆయన ముంధు.. ఈరోజు ఉండే కష్టం రేపు ఉండదు.. నీ ప్రయాణం కంటే గొప్పది కాదు నీకొచ్చిన కష్టం.. పోరాడు.. పోరాడి సాధించు..
ఎవరైనా ఒకరు మీకోసం ఎప్పుడు మీతోనే ఉంటూ.. మిమ్మల్ని జీవితం లో గొప్పగా చూడాలనుకుంటే .. మీకెప్పుడు సహాయం చేస్తూ ఉంటే.. వారిని గౌరవించండి.. ప్రేమించండి.. వారిని మోసం చేయకండి.. అలా చేసిన రోజే మీ పతనం మొదలవుతుంది .
ప్రేమ గొప్పది.. కానీ నీకంటే గొప్పది కాదు .. అసాధారణమైన ప్రేమ కలిగిన రాధ కృష్ణులే విడిపోక తప్పలేదు.. కానీ వారి ప్రేమ మరణించలేదు.. మిమ్మల్ని ఇస్తాపడే వారు ఎప్పుడు మీ మంచి కోరుకుంటూనే ఉంటారు.. మీరు దక్కలేదనే భాధ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లు కాదు.. వారి ప్రేమని గౌరవించండి.. వారి నిర్ణయాన్ని గౌరవించండి .. మీ ప్రేమ ఆ రాధాకృష్ణుల ప్రేమ లాగా ఎప్పటికీ ఈ జగత్తు గుర్తుంచుకుంటుంది .
ప్రేమ కోసం విదాచాల్సింది కన్నీరు కాదు... గుర్తుంచుకోండి . కష్టం రాదు .. మనం కొని తెచ్చుకుంటాం.. విచారించకూ నేస్తమా.. ఇది వెళ్ళిపోతుంది .. సంతోషం వస్తుంది నీ జీవితంలోకి ..
Post a Comment